గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 14:41:43

ఇర‌గ‌దీసిన అక్ష‌య్-కైరా..బుర్జ్ ఖ‌లీఫా వీడియో సాంగ్

ఇర‌గ‌దీసిన అక్ష‌య్-కైరా..బుర్జ్ ఖ‌లీఫా వీడియో సాంగ్

బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ల‌క్ష్మీబాంబ్‌. రాఘ‌వ‌లారెన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ మూవీ నుంచి పంజాబ్ అప్ బీట్ ట్రాక్ లో సాగే వీడియో సాంగ్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. దుబాయ్ లో బుర్జ్ ఖ‌లీఫా ఎంత ఫేమ‌స్సో ప్ర‌త్యేకించి  చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇప్ప‌డు అక్ష‌య్-కైరా బుర్జ్ ఖ‌లీఫా థీమ్ తో సాగే పాట‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు.

అక్ష‌య్ కుమార్ చాలా గ్యాప్ త‌ర్వాత త‌న‌లోని స్టైలిష్ డ్యాన్సింగ్ స్కిల్స్ తో అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. మ‌రోవైపు కైరా త‌న అంద‌చందాల‌తో పాట‌కు స్పైసీ లుక్ వ‌చ్చేలా చేసింది. శ‌శి కంపోజ్ చేసిన ఈ పాట‌ను డీజే ఖుషి, నిఖితా గాంధీ అద్బుతంగా పాడారు. గ‌గ‌న్ అహూజా పాట రాశారు. ఈ ఏడాది అతి పెద్ద డ్యాన్స్ ట్రాక్ ను అందిస్తున్నాం. ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉండండి అంటూ అక్ష‌య్ ఇన్ స్టాలో సాంగ్ ను షేర్ చేశాడు. డిస్నీ+హాట్ స్టార్ లో న‌వంబ‌ర్ 9న విడుద‌ల కానుంది. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo