మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 17:39:39

ఎన్సీబీ స‌మ‌న్లు..స్పందించ‌ని సుశాంత్ హీరోయిన్

ఎన్సీబీ స‌మ‌న్లు..స్పందించ‌ని సుశాంత్ హీరోయిన్

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్  మృతి కేసు విచార‌ణ‌లో డ్ర‌గ్స్ లింక్స్ తెర‌పైకి రావ‌డంతో ఎన్సీబీ విచార‌ణ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు సుశాంత్ కోస్టార్లను ఎన్సీబీ విచారించింది. అయితే సుశాంత్ తో క‌లిసి డ్రైవ్ సినిమాలో న‌టించిన స‌ప్నా ప‌బ్బికి ఎన్సీబీ అధికారులు స‌మ‌న్లు జారీచేసినా..ఆమె ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేద‌ట‌. ఈ కేసులో అక్టోబ‌ర్ 19న అర్జున్ రాంపాల్ స్నేహితురాలు  గాబ్రియెల్లా డెమిట్రియాడ్స్ సోద‌రుడు అగిసిలావోస్ ను ముంబై లోనావాలా ఏరియాలోని రిసార్ట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. దాడుల స‌మ‌యంలో అగిసిలావోస్ ఇంట్లో నిషేధిత అల్ఫాజోల‌మ్ ట్యాబ్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 

ఎన్సీబీ అధికారులు విచారించ‌గా..స‌ప్నా ప‌బ్బి పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో స‌ప్నా ప‌బ్బికి విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా స‌మ‌న్లు జారీచేసినా..ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి స్పంద‌న లేదు. ఒక‌వేళ ఆమె స్పందించ‌క‌పోతే త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎన్సీబీ అధికారి ఒక‌రు తెలిపారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.