గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 17:19:57

జెర్సీ రీమేక్..ఉత్త‌రాఖండ్ షెడ్యూల్ పూర్తి

జెర్సీ రీమేక్..ఉత్త‌రాఖండ్ షెడ్యూల్ పూర్తి

నాని లీడ్ రోల్ లో తెర‌కెక్కిన చిత్రం జెర్సీ. గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ మూవీలో శ్ర‌ద్దాశ్రీనాథ్ హీరోయిన్ గా న‌టించింది. ఈ మూవీ బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకోవ‌డమేకాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. జెర్సీని హిందీలో షాహిద్ క‌పూర్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టు ఉత్త‌రాఖండ్ షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. షాహిద్ క‌పూర్ ఈ విష‌యాన్ని ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు.

కోవిడ్ ప‌రిస్తితుల్లో జాగ్ర‌త్తలు తీసుకుంటూ షూటింగ్ పూర్తి చేసుకునేందుకు స‌హ‌క‌రించిన రాష్ట్ర ప్ర‌భుత్వానికి షాహిద్ క‌పూర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. ఉత్త‌రాఖండ్ లోని అనేక అంద‌మైన లొకేష‌న్ల‌లో మా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సుర‌క్షితంగా షూటింగ్ చేసుకోవాల‌ని అండ‌గా నిలిచిన ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు అని ట్వీట్ చేశాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo