శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 15:45:33

మాన్య‌త ఫొటో తీసిన సంజ‌య్‌ద‌త్..స్టిల్ వైర‌ల్

మాన్య‌త ఫొటో తీసిన సంజ‌య్‌ద‌త్..స్టిల్ వైర‌ల్

బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ దత్ ప్ర‌స్తుతం త‌న కుటుంబంతో స‌ర‌దాస‌మ‌యాన్ని గ‌డుపుతున్నాడు. దుబాయ్‌లో సంజ‌య్ స‌తీమ‌ణి మాన్య‌త‌, పిల్ల‌లు ఇఖ్రా, షారాన్ తో క‌లిసి ఎంజాయ్ చేస్తున్నాడు. క్యాన్స ర్ తో ఫైట్ చేస్తోన్న మున్నాభాయ్ ఇపుడు ఫొటోగ్రాఫ‌ర్ గా మారాడు. బ్లూ కల‌ర్ హాల్ట‌ర్ నెక్ మ్యాక్సీ డ్రెస్ లో మెరిసిపోతున్న మాన్య‌త‌ను కెమెరాలో బంధించాడు సంజ‌య్‌. మాన్య‌త అప్ క‌మింగ్‌ హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోకుండా గార్జియ‌స్ లుక్ లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తుంది.

సంజ‌య్ ద‌త్ తీసిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన మాన్య‌త‌.. నీ జీవితంలో సుదీర్ఘ ప్ర‌యాణం. ఈ ప్ర‌యాణం నిన్ను నీవు గుర్తించేలా చేసింది..అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది మాన్య‌త‌. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ బారిన ప‌డ్డ సంజ‌య్ ద‌త్  ముంబైలోని ఆస్ప‌త్రిలో చికిత్స ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. త‌మ అభిమాన న‌టుడు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు సంజూభాయ్ అభిమానులు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo