గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 04, 2020 , 20:08:16

యాక్టివ్ గా లేని సంజ‌య్ ద‌త్..ఫొటో చ‌క్క‌ర్లు

యాక్టివ్ గా లేని సంజ‌య్ ద‌త్..ఫొటో చ‌క్క‌ర్లు

స్టేజీ4 క్యాన్స‌ర్ బారిన‌ప‌డ్డ బాలీవుడ్ యాక్ట‌ర్ సంజ‌య్‌ద‌త్ చికిత్స తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఆరోగ్యం స‌హ‌క‌రించే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో షూటింగ్స్ లో పాల్గొన‌డం లేదు సంజ‌య్‌ద‌త్ . ప్ర‌స్తుతం ముంబై హాస్పిట‌ల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సంజ‌య్‌ద‌త్‌..దుబాయ్ టూర్‌లో దిగిన ఫొటో ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇటీవ‌లే త‌నభార్య మాన్య‌త‌, పిల్ల‌తో క‌లిసి దుబాయ్ లో స‌ర‌దాగా గ‌డిపిన సంజ‌య్ ఎయిర్ పోర్టులో చాలా బ‌ల‌హీనంగా క‌నిపించారు.

చాలా యాక్టివ్ గాఉండే త‌మ అభిమాన న‌టుడిని ఒక్క‌సారిగా ఇలా చూసిన ఫ్యాన్స్ ఆవేద‌న‌ వ్య‌క్తం చేస్తున్నారు. సంజ‌య్ ద‌త్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo