సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 03, 2020 , 10:27:48

ప్ర‌భాస్ చిత్రంలో విల‌న్ గా సైఫ్ అలీఖాన్ ఫిక్స్‌

ప్ర‌భాస్ చిత్రంలో విల‌న్ గా సైఫ్ అలీఖాన్ ఫిక్స్‌

టాలీవుడ్ యాక్ట‌ర్ ప్ర‌భాస్ హీరోగా ఆదిపురుష్ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. తానాజీ ఫేం ఓం రావ‌త్ డైరెక్ష‌న్ లో వ‌స్తోన్న ఈ చిత్రం జ‌న‌వ‌రి లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విల‌న్ గా క‌నిపించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఆదిపురుష్ చిత్రంలో లంకేశ్ గా సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు. సైఫ్ అలీఖాన్ తానాజీ చిత్రంలో ఇప్ప‌టికే విల‌న్ గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు.

తాజాగా ఓం రావ‌త్ డైరెక్ష‌న్ లో మ‌రో సినిమాలో న‌టిస్తున్నాడు. రామాయ‌ణం ఆధారంగా వ‌స్తోన్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఆదిపురుష్ చిత్రాన్ని హిందీ, తెలుగు భాష‌ల్లో ఏక‌కాలంగా చిత్రీక‌రించ‌నున్నారు. ఈ చిత్రాన్ని భూష‌న్ కుమార్, క్రిష్ణన్ కుమార్‌, ఓం రావ‌త్‌, ప్ర‌సాద్ సుతార్, రాజేశ్ నాయ‌ర్ నిర్మిస్తున్నారు. 



లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo