ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 17:23:05

గ‌తం వ‌ద్దు..ఇప్పు‌డైతే హ్యాపీగానే ఉన్నా

గ‌తం వ‌ద్దు..ఇప్పు‌డైతే హ్యాపీగానే ఉన్నా

త‌న న‌ట‌న‌, కామెడీ ట‌చ్ తో ఎంతోమంది ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు బాలీవుడ్ న‌టుడు రాజ్‌పాల్ యాద‌వ్‌. సూప‌ర్ హిట్ హిందీ చిత్రాల్లో న‌టించి త‌న మేన‌రిజంతో అంద‌రినీ అల‌రించాడు. ఈ యాక్ట‌ర్ తాజాగా ప్రియద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న హంగామా 2లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అయితే 2018లో రాజ్‌పాల్ యాద‌వ్ కెరీర్ కొంత చిక్కుల్లో ప‌డ్డ‌ది. రాజ్ పాల్ యాద‌వ్ 2010లో డైరెక్ట‌ర్ (డెబ్యూట్‌)గా ఆటా పాటా లాప‌ట చిత్రం చేయ‌డం కోసం ఢిల్లీకి చెందిన వ్యాపార‌వేత్త ఎంజీ అగ‌ర్వాల్ ద‌గ్గ‌ర రూ.5 కోట్లు అప్పుగా తీసుకొని..తిరిగివ్వ‌లేక‌పోయాడు. దీంతో ఎంజీ అగ‌ర్వాల్ ఢిల్లీ కోర్టును ఆశ్ర‌యించ‌డంతో..కోర్టు రాజ్ పాల్ కు మూడు నెల‌ల జైలు శిక్ష విధించింది. దీనిపై మీడియాపై ప్ర‌శ్నించ‌గా..తాను నెగెటివ్ సంఘ‌ట‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతుంటాన‌ని రాజ్‌పాల్  చెప్పాడు.

గ‌త 15 ఏండ్లుగా నన్ను ర‌క్షించుకునేందుకు ఏ విష‌యం చెప్పుకోలేదు. నేను నెగెటివ్ గా ఆలోచించ‌ను. ఎవ‌రు పాజిటివ్‌, ఎవ‌రు నెగెటివ్ గా ఉంటారో నాకు తెలియ‌దు. కానీ నా వ‌ర్క్ ఏంటో నాకు తెలుసు. ప‌ని ఉన్న చోట క‌ష్టం కూడా ఉంటుంది. నా గ‌తం తాలూకు భారాన్ని వెంట తీసుకుపోలేను. ప్ర‌జ‌లు నా ప‌నిని ఇష్ట‌ప‌డితే ముందుకెళ్తా. ఇది జీవితానికి సంబంధించిన విష‌యం. ప్ర‌తీ రోజు సూర్య‌కిర‌ణాలు కొత్తగా క‌నిపిస్తుంటాయి. ఇన్నాళ్లుగా త‌న వెంట‌ అభిమానుల ప్రేమ ఉంద‌ని, ప్ర‌స్తుతానికి తాను సంతోషంగా ఉన్నాన‌ని చెప్పుకొచ్చాడు. రాజ్ పాల్ యాద‌వ్ తెలుగులో ర‌వితేజ హీరోగా న‌టించిన కిక్ 2 లో కీల‌క పాత్ర‌లో న‌టించాడు. 

View this post on Instagram

Hungama with the best???? @rajpalofficial #hungama2

A post shared by Meezaan (@meezaanj) on

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo