శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 21:59:19

అక్ష‌య్ ప్రైవేట్ జెట్ ఖ‌రీదు తెలిస్తే షాక్‌..!

అక్ష‌య్ ప్రైవేట్ జెట్ ఖ‌రీదు తెలిస్తే షాక్‌..!

 అక్ష‌య్ కుమార్ చిన్న సినిమాల‌తో కెరీర్ షురూ సూప‌ర్ స్టార్ గా మారిన న‌టుడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వ‌శ‌క్తితో, ప‌ట్టుద‌ల‌తో ఎవ్వ‌రూ పొంద‌లేని స్టార్ డ‌మ్ ను సంపాదించాడు. బాలీవుడ్ లో ఉన్న ధ‌నిక స్టార్ హీరోల్లో అక్ష‌య్ ఒక‌డు. అక్ష‌య్ సినిమాలు బాక్సాపీస్ వ‌ద్ద వంద‌ల కోట్లు వ‌సూలు చేస్తాయి. సామాజిక బాధ్య‌త‌ల విష‌యంలో అంద‌రికంటే ముందుండే అక్ష‌య్ కుమార్ లైఫ్ స్టైల్ కూడా రిచ్ గా ఉంటుంది. ల‌గ్జరీ బైకులు, కార్లు, ఇత‌ర అత్యాధునిక సౌక‌ర్యాలున్నాయి. వీటిలో ప్రైవేట్ జెట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సింది.

అక్ష‌య్ కుమార్ రూ.260 కోట్లు పెట్టి అధునాత‌న సౌక‌ర్యాలున్న ప్రైవేట్ జెట్ ను మెయింటైయిన్ చేస్తున్నాడంటే ల‌గ్జ‌రీ లైఫ్ ను అనుభవించే తార‌ల్లో ఏ పొజిష‌న్ లో ఉన్నాడో అర్త‌మ‌వుతుంది. అభిమానుల విష‌యంలోనూ, రాయ‌ల్ లైఫ్ స్టైల్ ను మెయింటైయిన్ చేసే అంశంలోనూ అక్ష‌య్ రాజు లాంటివాడేన‌ని చెప్పొచ్చు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అక్ష‌య్ కుమార్ అంటే అంద‌రికీ చాలా ప్రేమ‌, ఇష్టం. అక్ష‌య్ కుమార్ ప్ర‌స్తుతం నాలుగు ప్రాజెక్టుల‌ను లైన్ లో పెట్టాడు. బెల్ బాట‌మ్ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే షురూ అయింది. ప్రైవేట్ జెట్ లో నుంచి ప్ర‌భుదేవా అక్ష‌య్ కిందికి దిగుతున్న ఫొటో ఒక‌టి నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo