శుక్రవారం 27 నవంబర్ 2020
Cinema - Oct 29, 2020 , 09:33:21

కాజ‌ల్ ప్రీ వెడ్డింగ్ ఫోటో వైర‌ల్‌

కాజ‌ల్ ప్రీ వెడ్డింగ్ ఫోటో వైర‌ల్‌

టాలీవుడ్ అందాల చంద‌మామ అక్టోబ‌ర్ 30న త‌న చిన్నానాటి స్నేహితుడితో ఏడ‌డుగులు వేయ‌నుంది. ఇప్ప‌టికే కాజ‌ల్ పెళ్ళి ప‌నులన్నీ పూర్తి కాగా, ఈ రోజు సంగీత్ వేడుక జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. బుధ‌వారం రోజు జ‌రిగిన మెహందీ వేడుక‌లో దిగిన ఫోటోని కాజ‌ల్  త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఇందులో త‌న చేతికి పెట్టుకున్న మెహందీని చూపిస్తూ చిరున‌వ్వులు చిందిస్తుంది.

కాజ‌ల్ మెహందీ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఈ ఫోటోకి పెళ్ళి క‌ల వ‌చ్చేసిందే బాల అంటూ కామెంట్స్ పెడుతున్నారు. క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ కాజ‌ల్ వివాహం కేవ‌లం కుటుంబ స‌భ్యుల మ‌ధ్యే జ‌ర‌గ‌నుంది. ఇండ‌స్ట్రీకి సంబంధించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హాజ‌రు కానున్న‌ట్టు తెలుస్తుంది.