గరుడ శేఖర్, సునీత సద్గురు జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్రాందీ డైరీస్’. శివుడు దర్శకుడు. ఏప్రిల్లో విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘క్రౌడ్ ఫండింగ్ చిత్రమిది. కథానుగుణంగా టైటిల్ పెట్టాం. ఆరుగురు వ్యక్తుల చుట్టు కథ తిరుగుతుంది. మద్యపాన వ్యసనం వల్ల వచ్చే ఇబ్బందులు, నష్టాల్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. సంభాషణలు సందేశాత్మకంగా ఉంటాయి. రొటీన్ సినిమాలకు భిన్నంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అన్నారు. వందకుపైగా లొకేషన్లలో సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ జరిపామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఈశ్వరన్ తంగవేల్, సంగీతం: ప్రకాష్ రెక్స్, రచన-దర్శకత్వం: శివుడు.