శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 03, 2020 , 09:13:23

ప్రియాంక మెడ‌లో పూల‌మాల వేసిన వ్య‌క్తి.. పెళ్ళైన‌ట్టు ప్రచారం

ప్రియాంక మెడ‌లో పూల‌మాల వేసిన వ్య‌క్తి.. పెళ్ళైన‌ట్టు ప్రచారం

సెల‌బ్రిటీల విష‌యంలో పుట్టే పుకార్లు ఒక్కోసారి ఎంతో ఫన్నీగా అనిపిస్తాయి. 2014లో ప్రియాంక చోప్రాకి సంబంధించిన రూమ‌ర్ ఇప్పుడు హాట్ టాపిక్ కావ‌డంతో దీనిపై నెటిజ‌న్స్ కూల్ కామెంట్స్ చేస్తున్నారు. వివరాల‌లోకి వెళితే దేశీ గార్ల్ ప్రియాంక చోప్రా.. 2014లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ప్రియాంకకు బ్రాండన్ షుష్టర్ అనే వ్యక్తి పూలమాల వేసి గ్రీన్ కార్పెట్‌పై స్వాగతం పలికాడు. అంతే కాకుండా ప్రియాంకతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. 

బ్రాండ‌న్‌.. ప్రియాంక మెడ‌లో పూల‌మాల వేసే స‌రికి చాలా మ్యాగ‌జైన్స్ ఇద్ద‌రికి పెళ్ళి అయిన‌ట్టు వార్త‌లు ప్ర‌చురించాయి. ఇది చూసి షాక్ అవ్వ‌డం బ్రాండ‌న్ వంతు అయింది. అప్ప‌ట్లో జ‌రిగిన విష‌యాన్ని తాజాగా గుర్తు చేసుకున్న బ్రాండ‌న్‌..స్వాగ‌తం ప‌లికేందుకు పూల మాల వేస్తే పెళ్లైన‌ట్టు వార్త‌లు రాసారు. భార‌తీయ సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్ళిలో పూల మాల వేస్తార‌ని త‌ర్వాత తెలుసుకున్నాను. ప్రియాంకి, నాకు పెళ్లైన‌ట్టు అప్ప‌ట్లో చాలా ప్ర‌తిక‌లు ప్ర‌చురించ‌డం నాకు చాలా ఆశ్చ‌ర్య‌మేసింది. పెద్ద సెల‌బ్రిటీని కూడా అయిపోయాను అని పాత సంఘ‌ట‌ల‌ని మ‌రో సారి గుర్తు చేసాడు బ్రాండ‌న్. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా.. అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ని 2018 చివర్లో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. 


logo