బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 26, 2020 , 08:30:34

అలా ఉన్నాను కాబ‌ట్టే 23 పెళ్లిళ్లు చేయ‌గ‌లిగాను: బ‌్ర‌హ్మీ

అలా ఉన్నాను కాబ‌ట్టే 23 పెళ్లిళ్లు చేయ‌గ‌లిగాను: బ‌్ర‌హ్మీ

కొన్ని ద‌శాబ్ధాలుగా త‌న‌దైన కామెడీతో ప్రేక్ష‌కుల పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్విస్తున్న కామెడీ బ్రహ్మా బ్ర‌హ్మానందం. ఒక‌ప్పుడు బ్రహ్మానందం కోసమే సినిమాలు చూసేవారంటే అతిశయోక్తి కాదు. త‌న‌దైన టైమింగ్‌తో చ‌క్క‌గా కామెడీ పండించే బ్ర‌హ్మానందం రెమ్యున‌రేష‌న్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటార‌నే ఒక రూమ‌ర్ కొన్నాళ్ళుగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంది. దీనిపై తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.  

చిత్రపరిశ్రమలో నేను చాలా మంది నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసుకోలేదు కానీ ఏం నేర్చుకోకూడదో తెలుసుకున్నానని అన్నారు బ్ర‌హ్మానందం. డబ్బుని నెగ్లెట్ చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు.. ఒకవేళ డబ్బు విషయంలో నేను గట్టిగా లేనని అనుకుంటే రోజుకి వంద రూపాయిలు ఇచ్చేవాడు.. పది రూపాయలే ఇస్తానంటే నా జీవితం ఏంటి? దీన్ని నేను డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వడం అని అంటానని చెప్పుకొచ్చారు.  అలా డబ్బుకు రెస్పెక్ట్ ఇచ్చాను కాబట్టే 23 మంది ఆడపిల్లలకు నా చేతులతో పెళ్లి చేయించగలిగానని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. నేను ఆ ఆడపిల్లలకు పెళ్లి చేయకపోతేవాళ్ల జీవితాలు ఏమయ్యేవి? ఆ బాధ్యతతోనే నేను వాళ్లకు పెళ్లి చేశాను. ఇవన్నీ నేను చెప్పుకోవాల్సిన విషయాలు కాదని బ్రహ్మానందం వెల్లడించారు 


logo