ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 10, 2020 , 21:14:43

మాజీ భార్య ఇంటికి 2 వారాల్లో 2 సార్లు

మాజీ భార్య ఇంటికి 2 వారాల్లో 2 సార్లు

లాస్‌ఏంజెల్స్‌: హాలీవుడ్‌ యాక్టర్‌ స్టార్‌ కపుల్‌ బ్రాడ్‌పిట్‌, ఏంజెల్స్‌ కొన్నేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే. అయితే విడివిడిగా ఉన్నా ఒకరికొకరి మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. బ్రాడ్‌ పిట్‌ తన మాజీ భార్య ఏంజెలినా జోలి ఇంటికెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. బ్రాడ్‌పిట్‌ రెండు వారాల్లో 2 సార్లు ఏంజెలినా ఇంటికెళ్లినట్లు కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఇటీవలే బ్రాడ్‌పిట్‌ బైకుపై ఏంజెలీనా జోలి ఇంటి నుంచి బయటకు వస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. బ్రాడ్‌పిట్‌-ఏంజెలినా జోలికి ఆరుగురు సంతానం కాగా..ఇద్దరూ కలిసి పిల్లల బాగోగులు చూసుకుంటున్నారట. పిల్లల కోసం ఫ్యామిలీ థెరపీ ఫాలో అవుతున్నారట. 

కవల సంతానం నాక్స్‌, వివియెన్నే బర్త్‌ డే మరో 2 రోజులు ఉండగా బ్రాడ్‌పిట్‌ తన మాజీ భార్య ఇంటికెళ్లి వచ్చినట్టు టాక్‌. కుటుంబం క్షేమం కోసం బ్రాడ్‌పిట్‌ నుంచి నేను విడిపోయాను. నేను సరైన నిర్ణయమే తీసుకున్నా. నా పిల్లల సమస్యలు నయం చేయడంపైనే దృష్టి పెట్టానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది జోలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo