ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 08, 2020 , 20:08:04

నేను కొడ‌తాన‌ని బాయ్స్ భ‌య‌ప‌డ్డారు..డేటింగ్ పై యామీ గౌత‌మ్‌

నేను కొడ‌తాన‌ని బాయ్స్ భ‌య‌ప‌డ్డారు..డేటింగ్ పై యామీ గౌత‌మ్‌

ఫెయిర్ అండ్ ల‌వ్ లీ యాడ్ తో పాపుల‌ర్ అయి, ఆ త‌ర్వాత చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది హిమాచ‌ల్ బ్యూటీ యామీ గౌత‌మ్‌. తెలుగు, త‌మిళం, హిందీలో ప‌లు చిత్రాలు చేసిన ఈ భామ త‌న‌కంటూ ప్ర‌త్యేక ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. ప్ర‌స్తుతం గిన్నీ వెడ్స్ స‌న్నీ అనే చిత్రం చేస్తోంది. గ‌తంలోనే ఈ చిత్రం థియేట‌ర్ల‌లో విడుద‌ల కావాల్సి ఉండ‌గా..క‌రోనా ప్ర‌భావంతో వాయిదా ప‌డింది. రేపు ఓటీటీ ఫ్లాట్ ఫాంలో విడుద‌ల‌వుతుంది. తాజాగా నేష‌న‌ల్ మీడియాతో జ‌రిపిన చిట్ చాట్ లో డేటింగ్ పై త‌న అభిప్రాయం చెప్పుకొచ్చింది. 

నేను పాత స్కూల్ రొమాంటిక్ ప‌ర్స‌న్‌ను. ఇపుడున్న డేటింగ్ సంస్కృతితో నేను పోటీ ప‌డ‌లేను. ఇది డిజిట‌ల్ యుగం. ఈ ప్లాట్ ఫాంలో భాగ‌స్వామిని ఎంచుకునేందుకు చాలా ర‌కాల మార్గాలు, ఆప్ష‌న్లున్నాయి. దీంతోపాటు చాలా ర‌కాల కాంప్లికేష‌న్స్ కూడా ఉన్నాయి. స‌రైన ప్రేమ‌ను గుర్తించ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. ప్ర‌స్తుతం ప్రేమ అర్థం, ప్రాముఖ్య‌త మారిపోయాయి. వాటితో నేను క‌నెక్ట్ కాలేను ప్ర‌స్తుతం ప‌ట్ట‌ణాల్లో అన్ని ఉన్నాయి కానీ ఇక్క‌డి జీవితాల్లో ఏదో శూన్య‌త అలాగే ఉండిపోయింద‌ని చెప్పింది. 

అదృష్ట‌వ‌శాత్తు స్కూల్ లో కానీ, యూనివ‌ర్సిటీలో కానీ బాయ్స్ నా ద‌గ్గ‌ర వచ్చేవారు కాదు. నా ద‌గ్గ‌ర‌కు రావాలంటే భ‌య‌ప‌డేవారు. దీనికార‌ణం నేను వారిని తిర‌స్క‌రిస్తాన‌నైనా అనుకొని ఉండాలి... లేదా కొడ‌తాన‌నుకొని అయినా అయి ఉండాల‌ని చెప్పుకొచ్చింది యామీ. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo