శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 19, 2021 , 12:44:41

ఖుషీ క‌పూర్ ఎంట్రీపై బోనీ క‌పూర్ క్లారిటీ..!

ఖుషీ క‌పూర్ ఎంట్రీపై బోనీ క‌పూర్ క్లారిటీ..!

శ్రీదేవి, బోనీ క‌పూర్ ముద్ద‌ల కూతుళ్లు జాన్వీ క‌పూర్, ఖుషీ క‌పూర్ ఎప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటారు. జాన్వీ ఇప్ప‌టికే ద‌ఢ‌క్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇవ్వ‌గా, ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది.ఇక రెండో కూతురు ఖుషీ క‌పూర్ విష‌యానికి వ‌స్తే గ‌త కొద్ది రోజులుగా ఆమె వెండితెర ఎంట్రీపై అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై తాజాగా ఆమె తండ్రి, నిర్మాత బోనీ క‌పూర్ క్లారిటీ ఇచ్చారు. 

అతి త్వ‌ర‌లోనే ఖుషీ వెండితెర ఆరంగేట్రం చేస్తుంద‌ని చెప్పిన బోనీ క‌పూర్.. నా ద‌గ్గ‌ర అన్ని అవ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికీ, మొద‌ట మాత్రం నేను ప‌రిచ‌యం చేయ‌ను. తండ్రిగా ఖుషీ సొంతంగా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. అందుకే నేను ఆమె తొలి సినిమాని నిర్మించాల‌ని అనుకోవ‌డం లేదు అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం లండన్‌లో ఫిలీం స్కూల్‌లో యాక్టింగ్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్న ఖుషీ అతి త్వ‌ర‌లోనే సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తుంద‌ని స‌మాచారం.

VIDEOS

logo