90 ఏళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ (Telugu Cinema Industry) ప్రస్థానంలో ఎన్నో మరపురాని సినిమాలు వచ్చుంటాయి..మరెన్నో సినిమాలు చరిత్రలో నిలిచిపోయాయి. కొన్ని వేల సినిమాలు విడుదలై ఉంటాయి. అందులో ది బెస్ట్ 25 సినిమాల లిస్ట్ తీయాలంటే ఎలా ఉంటుంది..అందులో వేటికి చోటు ఉంటుంది..అలాంటి సినిమాల్లో కచ్చితంగా చోటు దక్కించుకునే సినిమా బొమ్మరిల్లు (Bommarillu). తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది. భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ (Siddharth), జెనిలియా జంటగా నటించారు.
ఇలాంటి ఒక అద్భుతం విడుదలై 15 సంవత్సరాలు గడిచింది. 2006 ఆగస్టు 9న విడుదలైన బొమ్మరిల్లు థియేటర్లలో నిజంగానే బొమ్మరిల్లు విరబూసేలా విజయం సాధించింది. ఈ సినిమా 15 ఏళ్ళ కింద ఎంత వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాం..
ప్రాంతాల వారిగా కలెక్షన్స్ :
నైజాం: 7.24 కోట్లు
సీడెడ్: 1.69 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.91 కోట్లు
ఈస్ట్: 1.47 కోట్లు
వెస్ట్: 1.11 కోట్లు
గుంటూరు: 1.27 కోట్లు
కృష్ణా: 0.97 కోట్లు
నెల్లూరు: 0.73 కోట్లు
ఏపీ + తెలంగాణ: 16.39 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 6.37 కోట్లు
వరల్డ్ వైడ్: 22.76 కోట్లు
అప్పట్లో ‘బొమ్మరిల్లు’ సినిమాకు పెట్టిన బడ్జెట్ రూ.6 కోట్ల లోపే..చేసిన బిజినెస్ కూడా రూ.9 కోట్లు మాత్రమే. అప్పటికి సిద్ధూకు ఇది ఎక్కువ థియేట్రికల్ బిజినెస్సే. అయితే సినిమాపై నమ్మకంతో నిర్మాత దిల్ రాజు చాలా చోట్ల బొమ్మరిల్లును ఓన్ రిలీజ్ చేసుకున్నాడు. దాంతో లాభాలు మరింత ఎక్కువగా వచ్చాయి. ఈ సినిమాకు రూ.22.76 కోట్ల షేర్ వచ్చింది. అంటే నిర్మాతలతో పాటు బయ్యర్లకు కూడా దాదాపు 13 కోట్ల లాభాలు తీసుకొచ్చింది బొమ్మరిల్లు.
ఇవి కూడా చదవండి..
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
శృతి హాసMahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?