ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 07, 2020 , 18:26:16

రియా రిలీజ్ కు ముందు కోర్టు పేర్కొన్న కీల‌క అంశాలివే..!

రియా రిలీజ్ కు ముందు కోర్టు పేర్కొన్న కీల‌క అంశాలివే..!

సుశాంత్‌ మరణం కేసులో డ్రగ్స్ లింక్స్ కోణంలో అరెస్టైన న‌టి రియా చ‌‌క్ర‌వ‌ర్తి ఇవాళ సాయంత్రం జైలు నుంచి విడుద‌ల‌య్యారు. బెయిల్ కోసం రియా బాంబే హైకోర్టును ఆశ్రయించగా బుధవారం పలు కండిషన్లు, రూ.లక్ష పూచికత్తుపై బెయిల్‌ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు రియా బైకుల్లా జైలు నుంచి విడుద‌ల‌య్యారు.


బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు పేర్కొన్న కీల‌క అంశాలు: 

* సెల‌బ్రిటీలు, రోల్ మోడ‌ల్స్ ప‌ట్ల బాంబే హైకోర్టు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని అనుకోవ‌డం లేదు. దీనిని యువ‌త‌రానికి ఓ ఉదాహ‌ర‌ణ‌గా తెలియ‌జేయ‌వ‌చ్చు. 

* చ‌ట్టం ముందు అంద‌రూ స‌మాన‌మే. ఏ సెల‌బ్రిటీ అయినా, రోల్ మోడ‌ల్ అయినా కోర్టు ముందు ప్ర‌త్యేక హ‌క్కును పొంద‌రు. స‌ద‌రు  వ్య‌క్తి  కోర్టులో చ‌ట్టాన్ని ఎదుర్కొంటున్న స‌మ‌యంలో ప్ర‌త్యేక బాధ్య‌త అంటూ కూడా ఏమీ ఉండ‌దు. కోర్టు నిందితుల స్థితిగ‌తుల‌తో సంబంధం లేకుండా ప్ర‌తీ కేసులో సొంతంగా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. 

* రియాకు డ్ర‌గ్ డీల‌ర్ల‌తో సంబంధాలు లేవు. డ‌బ్బు లేదా ఇత‌ర ప్ర‌యోజ‌నాల కోసం రియా మ‌త్తుప‌దార్థాల‌ను ఇత‌రుల‌కు ఇవ్వ‌లేదు. 

* క్రిమిన‌ల్ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌లేదు. రియా బెయిల్ పై విడుద‌లైన త‌ర్వాత ఎలాంటి నేరాల‌కు పాల్ప‌డ‌ర‌ని చెప్పేందుకు స‌హేతుక‌మైన కార‌ణాలున్నాయి. 

* ఎన్డీపీఎస్ యాక్ట్ ప్ర‌కారం (ఐపీసీ 24, 24ఏ సెక్ష‌న్ల కింద‌) లేదా ఇత‌ర ఆర్థికప‌ర‌మైన నేరాల్లో పాత్ర‌కు  సంబంధించి రియాను శిక్షించాల్సిన అవ‌స‌రం లేదన‌డానికి కార‌ణాలున్నాయ‌ని బాంబే హైకోర్టు పేర్కొంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo