మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 05, 2020 , 12:50:28

విజ‌య్ ఇంట్లో బాంబ్ .. అర్ధరాత్రి హైడ్రామా..!

విజ‌య్ ఇంట్లో బాంబ్ .. అర్ధరాత్రి హైడ్రామా..!

ఇటీవ‌లి కాలంలో స్టార్ హీరోల‌కి బాంబు బెదిరింపు కాల్స్ రావ‌డం అంద‌రిని ఆందోళ‌న‌కి గురి చేస్తుంది. ఆ మ‌ధ్య  చెన్నై పోయిస్‌ గార్డెన్‌ ప్రాంతంలోని రజినీకాంత్‌ ఇంట్లో బాంబు పెట్టారని , 108 నంబర్‌కు ఓ అజ్ఞాత ఫోన్‌కాల్‌ వచ్చింది. కంట్రోల్‌ రూం ద్వారా అప్రమత్తమైన పోలీసులు.. బాంబు నిర్వీర్య దళంతో కలిసి రజినీకాంత్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి ఆవరణతోపాటు పరిసరాలను తనిఖీ చేశారు. మ‌తిస్థిమితం లేని ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్థి ఈ ప‌ని చేశాడ‌ని పోలీసులు తేల్చారు.

తాజాగా త‌మిళ స్టార్ హీరో విజయ్ ఇంటి వద్ద అర్థ రాత్రి  హైడ్రామా నడిచింది. ఓ అజ్ఞాతవ్య‌క్తి పోలీసుల‌కి ఫోన్ చేసి విజ‌య్ ఇంట్లో బాంబ్ పెట్టిన‌ట్టు, అత‌నికి ప్రాణానికి హాని ఉంద‌ని అన్నాడు. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు సాలగ్రామం లోని విజయ్ ఇంటికి సిబ్బందితో చేరుకోని బాంబు కోసం గాలించారు. చుట్టుప‌క్క‌ల ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎవ‌రో ఆకతాయి ఈ పని చేసి ఉంటాడ‌ని భావించిన పోలీసులు ఎవ‌ర‌నే తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు .


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo