సోమవారం 25 మే 2020
Cinema - Mar 14, 2020 , 12:50:13

అమీర్ ఖాన్‌కి శుభాకాంక్ష‌లు తెలిపిన బాలీవుడ్

అమీర్ ఖాన్‌కి శుభాకాంక్ష‌లు తెలిపిన బాలీవుడ్

పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త వినోదాన్ని అందించే న‌టుల‌లో అమీర్ ఖాన్ ఒక‌రు. ఎప్పటి కప్పుడు వెరైటీ పాత్రలతో అలరిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆమీర్ ఖాన్ పాత్ర కోసం తన శరీకాకృతి  పూర్తిగా మార్చుకుంటారు. గతేడాది ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది. 

అమీర్ ఖాన్ ప్ర‌స్తుతం ‘లాల్ చంద్ చద్దా’ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అమీర్  సిక్కు యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. గుబురు గెడ్డం, తలపై పాగతో చ‌క్క‌ర్లు కొట్టిన‌ ఆమీర్ ఫోటో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ చిత్రాన్ని ‘ఫారెస్ట్ గంప్’ అనే సినిమా స్పూర్తితో దర్శకుడు అద్వైత్ చందన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆమీర్ ఖాన్..దాదాపు 20 కిలోల బరువు తగ్గడం విశేషం.  నేడు అమీర్ ఖాన్ 55వ బ‌ర్త్‌డే కావ‌డంతో బాలీవుడ్ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆయుష్మాన్ ఖురానా, జూహీ చావ్లా, మాధురి దీక్షిత్, స‌చిన్ టెండూల్క‌ర్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు అమీర్ ఖాన్‌కి త‌మ ట్విట్ట‌ర్ ద్వారా బ‌ర్త్ డే విషెస్ అందించారు.


logo