ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 13, 2020 , 14:49:28

బాలీవుడ్ స్టార్ క‌పుల్ అరుదైన ఫొటో వైర‌ల్

బాలీవుడ్ స్టార్ క‌పుల్ అరుదైన ఫొటో వైర‌ల్

బాలీవుడ్ తార‌లు సైఫ్ అలీఖాన్, క‌రీనాక‌పూర్ ప్రేమించి పెండ్లి చేసుకున్నార‌న్న విష‌యం తెలిసిందే. 2012 అక్టోబ‌ర్ 12న వీరిద్ద‌రూ వివాహ‌బంధంతో ఒక్క‌ట‌య్యారు. వీరిద్ద‌రి గారాల కుమారుడు తైమూర్ అలీఖాన్‌. సినిమాల‌తో బిజీబిజీగా ఉండే ఈ క‌పుల్..వీలైనంత ఫ్యామిలీ స‌మ‌యాన్ని కూడా ఎంజాయ్ చేస్తుంటారు. సైఫ్, క‌రీనా ఇద్ద‌రూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.  ఈ ఇద్ద‌రూ క‌లిసి ప‌లు చిత్రాల్లో కూడా న‌టించారు. అయితే వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా వ‌చ్చిన కుర్భాన్ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది.

తాజాగా ఈ సినిమాలో సైఫ్‌, క‌రీనా ప్రేమ‌సాగ‌రంలో మునిగితేలుతున్న స‌న్నివేశానికి సంబందించిన త్రోబ్యాక్ స్టిల్ ఒక‌టి ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌కర్లు కొడుతోంది. క‌రీనా నుదిటిపై సైఫ్ ప్రేమ‌గా కిస్ ఇస్తున్న అరుదైన స్టిల్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo