ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 14, 2020 , 20:05:09

బుర‌ద‌తో స‌ల్మాన్..రైతుల‌ను గౌర‌వించండి అంటూ క్యాప్ష‌న్

బుర‌ద‌తో స‌ల్మాన్..రైతుల‌ను గౌర‌వించండి అంటూ క్యాప్ష‌న్

క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ త‌న స‌మ‌యాన్ని పన్వేల్ ఫాం హౌజ్ లో గ‌డుపుతున్నాడు. ఫాం హౌజ్‌లోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో స‌ల్మాన్  నాటు వేస్తున్న‌ ఫోటో ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. తినేవాడి పేరు ధాన్యం మీద రాసి ఉంటుంది. జై జ‌వాన్ జై కిసాన్ అంటూ ఆ ఫొటోకి క్యాప్ష‌న్ కూడా ఇచ్చాడు స‌ల్లూభాయ్. తాజాగా స‌ల్మాన్ ఒళ్లంతా బుర‌ద అంటుకుని ఉండ‌గా తీసిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫొటోను పోస్ట్ చేసిన స‌ల్మాన్‌..రైతులంద‌రినీ గౌర‌వించండి అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. స్టార్ హీరో అయిన స‌ల్మాన్ సాదాసీదాగా పొలం ప‌నులు చేస్తూ.. రైతులను గుర్తు చేస్తూ పెడుతున్న ఫొటోలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo