గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 04, 2020 , 20:43:09

స‌ల్మాన్ ఖాన్ బ్యాక్ టు 'రాధే' షూట్‌..ఫొటో వైర‌ల్

స‌ల్మాన్ ఖాన్ బ్యాక్ టు 'రాధే' షూట్‌..ఫొటో వైర‌ల్

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ మ‌ళ్లీ షూటింగ్ తో బిజీగా మారిపోయాడు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో షూటింగ్స్ నిలిచిపోవ‌డంతో బ్రేక్ తీసుకున్న స‌ల్లూభాయ్..త‌న కొత్తం రాధే షూటింగ్ ను మొద‌లుపెట్టాడు. ఆరున్న‌ర నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ షూటింగ్ లో జాయిన్ కావ‌డం ఆనందంగా ఉంది..అంటూ లొకేష‌న్ లో దిగిన స్టిల్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు స‌ల్మాన్‌.

జీన్స్ డ్రెస్‌లో ఉన్న స‌ల్మాన్ రేస్ ట్రాక్ వైపు న‌డుచుకుంటూ వెళ్తుండ‌టం ఫొటోలో చూడొచ్చు. స‌ల్మాన్ తాజా ఫొటో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈచిత్రంలో దిశా ప‌టానీహీరోయిన్ గా న‌టిస్తుంది. ర‌ణ్ దీప్ హుడా,జాకీ ష్రాఫ్ కీల‌క ‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 


View this post on Instagram

Back to shoot after 6 1/2 months ... feels good #Radhe

A post shared by Salman Khan (@beingsalmankhan) on

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo