శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 16, 2020 , 19:54:19

స్టార్ హీరో కొడుకు ఇండ‌స్ట్రీ ఎంట్రీ..!

స్టార్ హీరో కొడుకు ఇండ‌స్ట్రీ ఎంట్రీ..!

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఇప్ప‌టికే చాలా మంది త‌మ పిల్ల‌ల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో స్టార్ యాక్ట‌ర్ త‌న కుమారుడిని సిల్వ‌ర్ స్క్రీన్ పై తీసుకువ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇంత‌కీ ఆ న‌టుడెవ‌రనుకుంటున్నారా..? అమీర్‌ఖాన్‌. మ‌ద‌ర్ క‌రేజ్ అండ్ హ‌ర్ చిల్డ్రెన్ నాట‌కంతోపాటు తొలిసారి ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు అమీర్ కుమారుడు జునైద్‌. మ‌ల‌యాళ చిత్రం ఇష్క్ హిందీ రీమేక్ లో జునైద్ న‌టించ‌నున్నాడు.

రొమాంటిక్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని అనురాజ్ మ‌నోహ‌ర్ డైరెక్ట్ చేయ‌గా..శ‌నే నిగ‌మ్‌-అన్ శీత‌ల్ లీడ్‌రోల్స్ లో న‌టించారు. నీర‌జ్ పాండే హిందీ రీమేక్ ను నిర్మించ‌నున్నాడు. మిగిలిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.  గ‌త మూడేళ్లుగా థియేట‌ర్ ఆర్ట్స్ లో జునైద్‌ మెల‌కువ‌లు నేర్చుకున్నాడ‌ట. లాస్ ఏంజెల్స్ లోని అమెరిక‌న్ అకాడ‌మీ ఆప్ డ్ర‌మెటిక్ ఆర్ట్స్ లో విద్యార్థి అయిన జునైద్ ఏ ఫార్మ‌ర్ స్టోరీ, ఏ ఫ్యూవ్ గుడ్ మెన్ వంటి నాట‌కాల్లో క‌నిపించాడు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.