బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 12, 2020 , 15:41:44

షూటింగ్‌కు వెళ్తే ఫ్యాన్స్‌ చుట్టుముట్టారు..వీడియో

షూటింగ్‌కు వెళ్తే ఫ్యాన్స్‌ చుట్టుముట్టారు..వీడియో

ముంబై: లాల్‌ సింగ్‌ చధా..అమీర్‌ఖాన్‌ నటిస్తోన్న కొత్త చిత్రం. ఇప్పటికే సగభాగం షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా లాక్‌ఎఫెక్ట్‌తో నిలిచిపోయింది. లాక్‌డౌన్‌ ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఎట్టకేలకు అమీర్‌ఖాన్‌ టీం టర్కీకి వెళ్లింది. ఇంకేముంది తమ అభిమాన నటుడు వస్తున్నాడంటే ఫ్యాన్స్‌ ఊరుకుంటారా..? ఫేస్‌ మాస్కు పెట్టుకుని వస్తున్న అమీర్‌ఖాన్‌ను అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. కోవిడ్‌-19 లాంటి విపత్కర పరిస్థితుల్లో సామాజిక దూరం తప్పనిసరి. అయినా చేసేదేమి అభిమానులకు సంతోషం కోసం వారితో నవ్వుతూ సెల్ఫీలు దిగాడు.

అమీర్‌ఖాన్‌ ఫ్యాన్స్‌ ఒక్కసారిగా మీదికి వస్తుండటంతో తప్పించుకుందామని ప్రయత్నించినా  వీలు కాలేదు. హాలీవుడ్‌ మూవీ ఫారెస్ట్‌ గంప్‌కు రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రానికి అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo