బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 12, 2020 , 14:06:54

వరల్డ్‌ హయ్యెస్ట్‌ పెయిడ్‌ యాక్టర్లలో అక్షయ్‌ 6వ స్థానం

వరల్డ్‌ హయ్యెస్ట్‌ పెయిడ్‌ యాక్టర్లలో అక్షయ్‌ 6వ స్థానం

ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ హీరో అరుదైన రికార్డును సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న సినిమా యాక్టర్ల జాబితాలో అక్షయ్‌కుమార్‌ ఛాన్స్‌ కొట్టేశాడు. అక్షయ్‌కుమార్‌ 2019 జూన్‌ 2020 జూన్‌ మధ్య రూ.362 కోట్లు (48.5 మిలియన్‌ డాలర్లు) సంపాదనతో.. పోర్బ్స్‌ టాప్‌-10 జాబితాలో అక్షయ్‌కుమార్‌ 6వ స్థానంలో నిలిచాడు. భారత్‌ నుంచి అక్షయ్‌ ఒక్కడే ఈ లిస్ట్‌లో చోటు సంపాదించడం విశేషం. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో డ్వానే జాన్సన్‌ టాప్‌ 1స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రెండో స్థానంలో ర్యాన్‌ రేనాల్డ్స్‌, మార్క్‌ వాల్‌ బెర్గ్‌, బెన్‌ అఫ్లెక్‌, విన్‌ డీజిల్‌, అక్షయ్‌కుమార్‌, లిన్‌-మాన్యుయల్‌ మిరండా, విల్‌స్మిత్‌, అడమ్‌ సాండ్లర్‌, జాకీ చాన్‌. 

గతేడాది అక్షయ్‌కుమార్‌ మిషన్‌ మంగళ్‌, హౌస్‌ఫుల్‌ 4, గుడ్‌న్యూస్‌ చిత్రాలతో బాక్సాపీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు అక్షయ్‌కుమార్‌. సినిమాతో పలు జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులను కూడా ప్రమోట్‌ చేస్తున్నాడు అక్షయ్‌కుమార్‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo