బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 08, 2020 , 17:23:58

ప్ర‌ముఖ బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్‌కి క‌రోనా పాజిటివ్

ప్ర‌ముఖ బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్‌కి క‌రోనా పాజిటివ్

క‌రోనా వైర‌స్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని కూడా వణికిస్తుంది. ఇప్ప‌టికే హాలీవుడ్‌కి చెందిన అనేక మంది న‌టీన‌టులు , సింగ‌ర్ వైర‌స్ బారిన ప‌డ‌గా, కొంద‌రు మృత్యువాత కూడా ప‌డ్డారు.ఇక బాలీవుడ్  ప్ర‌ముఖ నిర్మాత నిర్మాత క‌రీం మొరానీ కుమార్తెల‌కి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో హిందీ సినిమా ఇండ‌స్ట్రీ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. తాజాగా క‌రీంకి కూడా పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలుస్తుంది.

క‌రీం మొరానీ కుమార్తెలు షాజా, జోవాల‌కి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో వారిద్ద‌రిని ముంబైలోని నానావ‌తి ఆసుప‌త్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే కరీంకి కూడా పాజిటివ్ ల‌క్ష‌ణాలు ఉండడంతో, ఆసుప‌త్రికి వెళ్లి ప‌రీక్ష‌లు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ఈ విష‌యాన్ని క‌రీం సోద‌రుడు మొహ‌మ్మ‌ద్ మీడియాకి వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం క‌రీం కూడా నానావ‌తి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు . శ్రీలంక నుండి వ‌చ్చిన త‌ర్వాత షాజాకి పాజిటివ్ అని తేల‌గా, జోయా రాజస్థాన్ నుండి మార్చి నెల మ‌ధ్య‌లో ముంబైకి వ‌చ్చింది. ఆమెకి క‌రోనా సోకిన‌ట్టు ఇటీవ‌ల తేలింది. ప్ర‌స్తుతం కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప‌త్రిలో జోయా చికిత్స పొందుతుంది. మిగ‌తా కుటుంబ స‌భ్యుల‌ని ప్ర‌స్తుతం క్వారంటైన్‌లో ఉంచిన‌ట్టు స‌మాచారం. 

కరీం మొరానీ షారూఖ్‌కి మంచి స‌న్నిహితుడు కాగా, ఆయ‌న చెన్నై ఎక్స్‌ప్రెస్‌, హ్యాపీ న్యూ ఇయ‌ర్, రావ‌ణ్‌, దీవాలీ వంటి చిత్రాల‌ని నిర్మించారు 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo