శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 30, 2020 , 21:20:32

హీరోల కోడ్ నేమ్స్

హీరోల కోడ్ నేమ్స్

బాలీవుడ్ డ్ర‌గ్స్ లింక్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు కేవ‌లం హీరోయిన్ల‌ను మాత్రమే ఎందుకు విచార‌ణ‌కు పిలుస్తున్నార‌ని న‌టులు శేఖ‌ర్ సుమ‌న్‌, సుచిత్రా కృష్ణ‌మూర్తి ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అధికారులు విచార‌ణ‌లో త‌మ పంథా మార్చుకోనున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు దీపికాప‌దుకొనే, శ్ర‌ద్దాక‌పూర్, సారా అలీఖాన్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ ను విచారించిన అధికారులు..ముగ్గురు హీరోల‌కు స‌మ‌న్లు జారీచేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు బీటౌన్ లో టాక్ న‌డుస్తోంది. తాజా స‌మాచారం ఎన్సీబీ స‌మ‌న్లు జారీచేయ‌నున్న ముగ్గురు యాక్ట‌ర్లు గ‌తంలో దీపికా ప‌దుకొనేతో న‌టించిన వారేన‌ట‌.

విచార‌ణ‌లో దీపికా స‌ద‌రు ముగ్గురు కోస్టార్ల పేర్ల‌ను కోడ్ చేస్తూ.. "‌ఏ, ఎస్, ఆర్" అనే కోడ్ నేమ్స్ ను ఎన్సీబీ కి తెలియ‌జేసిన‌ట్టు స‌మాచారం. అంతేకాదు ఎన్సీబీ అధికారులు స‌ద‌రు ముగ్గురు హీరోల‌కు వ్య‌తిరేకంగా బ‌ల‌మైన ఆధారాల‌ను కూడా సంపాదించార‌ట‌. వ‌చ్చే వార‌మే ఆ ముగ్గురికి స‌మ‌న్లు కూడా జారీచేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు ఇన్‌సైడ్ టాక్. మ‌రి ఎన్సీబీ అధికారులు స‌మ‌న్లు జారీచేసే ఏ, ఎస్, ఆర్ లు ఎవ‌ర‌నేది త్వ‌ర‌లోనే తెలియ‌నుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.