దక్షిణాది సినిమాలతో పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్లు వీళ్లే..

బాలీవుడ్లో వాళ్లంతా స్టార్ హీరోయిన్లు.. సూపర్ స్టార్ హీరోయిన్లు. కానీ వాళ్ల అడుగు మొదలైంది మాత్రం అక్కడ కాదు. దక్షిణాది సినిమాలతో వాళ్ల కెరీర్ కు శ్రీకారం చుట్టారు. అక్కడ్నుంచి మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్ లో చక్రం తిప్పారు. అక్కడ స్టార్ హీరోయిన్లు అయిపోయారు. మరి వాళ్లెవరు.. వాళ్ల ప్రయాణం మొదలైన చోటు ఎక్కడ అనేది చూద్దాం..
దీపిక పదుకొనే: బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా చాలా కాలం చక్రం తిప్పింది దీపిక. కానీ ఈమె తొలి సినిమా మాత్రం హిందీలో చేయలేదు. కన్నడలో ఉపేంద్ర హీరోగా వచ్చిన ఐశ్వర్య అనే సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత షారుక్ ఖాన్ ఓం శాంతి ఓం సినిమాతో రాత్రికి రాత్రే మకాం ముంబైకి మార్చేసింది.
ప్రియాంక చోప్రా: మిస్ వరల్డ్ అయిన తర్వాత బాలీవుడ్ లో ప్రియాంక చోప్రాను ఎవరూ పట్టించుకోలేదు. ఆ టైమ్ లో విజయ్ హీరోగా వచ్చిన తమిళన్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది ప్రియాంక చోప్రా. అక్కడ్నుంచి మొదలైన ప్రయాణం కాస్తా ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళ్లింది.
ఐశ్వర్యా రాయ్: ప్రపంచ సుందరి టైటిల్ గెలిచిన తర్వాత ఐశ్వర్యా రాయ్‌ను హిందీ ఆడియన్స్ పట్టించుకోకపోయినా కూడా ఇద్దరు సినిమాతో మణిరత్నం ఈమెను తమిళ తెరకు పరిచయం చేసాడు.
దిశా పటానీ: కొత్త హీరోయిన్లను వెతికి పట్టుకునే పూరీ జగన్నాథ్ కళ్ళలో దిశా పటానీ పడింది. దాంతో వెంటనే లోఫర్ తో తెలుగు తెరకు పరిచయం చేసాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో వెలిగిపోతుంది దిశా.
కృతి సనన్: సుకుమార్ క్రియేటివ్ నుంచి బయటికి వచ్చిన సుందరి కృతి సనన్. నేనొక్కిడినే సినిమాతో పరిచయమైన ఈమె ఇప్పుడు బాలీవుడ్ లో బాగానే బిజీ అయిపోయింది.
తాప్సీ పన్ను: రాఘవేంద్రరావు ఝుమ్మంది నాదం సినిమాతో పరిచయమైన తాప్సీ.. బాలీవుడ్ లో అద్భుతమైన సినిమాలు చేసింది.
కత్రినా కైఫ్: బూమ్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయినా కూడా మల్లీశ్వరితోనే హిందీ దర్శక నిర్మాతల కళ్లలో పడింది కత్రినా. ఆ సినిమా తర్వాత అమ్మడి దశ మారిపోయింది.
తాజావార్తలు
- ఆ నలుగురు కరోనా టీకా వల్ల చనిపోలేదు: కేంద్ర ఆరోగ్య శాఖ
- అమెరికాలో సరికొత్త రోజు : జో బైడెన్
- స్పెయిన్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
- దీర్ఘకాలిక వీడ్కోలు కాదు.. తాత్కాలికమే : డోనాల్డ్ ట్రంప్
- బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఒబామా, క్లింటన్, బుష్
- ట్రాఫిక్ నిర్వహణపై జీహెచ్ఎంసీ సమావేశం
- బైక్‌ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత
- ‘క్రాక్’ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడెవరో తెలుసా..?
- ‘ది బీస్ట్’.. బైడెన్ ప్రయాణించే కారు విశేషాలు ఇవే..