శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Oct 02, 2020 , 13:26:48

బాలీవుడ్ హెయిర్‌స్టైలిస్ట్‌కు క‌రోనా..!

బాలీవుడ్ హెయిర్‌స్టైలిస్ట్‌కు క‌రోనా..!

బాలీవుడ్ హెయిర్‌స్టైలిస్ట్ ఆలిమ్ హ‌కీంకు క‌రోనా సోకిన‌ట్టు నిర్ధార‌ణ అయింది. ఈ విష‌యాన్ని ఆలీమ్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. డియ‌ర్ ఆల్, నేను కోవిడ్ 19 బారిన ప‌డ్డాను. సినిమా షూటింగ్ కోసం అని వ‌చ్చాను, అయితే నిబంధ‌న‌ల ప్ర‌కారం టెస్ట్ చేసి,  రిపోర్ట్ వ‌చ్చే వ‌ర‌కు ఐసోలేష‌న్‌లో ఉండాలని చెప్పారు. తాజాగా వ‌చ్చిన రిపోర్ట్స్ లో పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. కొద్ది రోజ‌లు పాటు ఒంట‌రిగా ఉండాలి. నాకు ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవు. క్షేమంగా ఉన్నాను. మీ సపోర్ట్‌కు ధ‌న్య‌వాదాలు అని ఆలిమ్ తెలిపారు.

ఆలిమ్ త్వ‌ర‌గా క‌రోనాని జ‌యించాల‌ని అభిమానులు, ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. బాలీవుడ్ ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్‌గా  ఉన్న ఆలిమ్ ..  సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, షాహిద్ కపూర్, హృతిక్ రోషన్, అజయ్ దేవ్‌గన్, సంజయ్ దత్ మరియు రణబీర్ కపూర్ వంటి పలువురు బాలీవుడ్ నటులకు  స్టైలిస్ట్‌గా ఉన్నారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన త‌ర్వాత  బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, విక్కీ కౌషల్ , వివేక్ ఒబెరాయ్‌ల‌కు కూడా హెయిర్ స్టైలిస్ట్‌గా ప‌ని చేశారు. వారి మేకొవర్ పూర్తిగా ప‌ని చేశారు. 


logo