స్విమ్ షూట్లో సోనాక్షి సిన్హా.. ఫొటోలు వైరల్

మొదటిసారే దబాంగ్ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కలిసి నటించి అందరినీ అలరించింది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షిసిన్హా. ఈ చిత్రంలో రజ్జో పాండేగా సోనాక్షి పోషించిన పాత్ర ఆల్టైల్ ఫేవరెట్ గా నిలిచింది. రజ్జో రోల్ కు సోనాక్షి తప్ప మరెవరు న్యాయం చేయరంటే అతిశయోక్తి కాదు. అందం, అభినయంతోపాటు డ్యాన్స్ లోనూ ఎవరికీ తీసిపోదు ఈ భామ. ఈ బ్యూటీ ఐలాండ్ లో సరదాగా షికారు చేస్తోంది. ఎక్కువగా సంప్రదాయ వస్త్రాల్లో కనిపించే ఈ బ్యూటీ సముద్రతీరంలో స్విమ్షూట్ లో కనిపించింది. బ్లాక్ టాప్, వైట్ వేర్ లో హొయలుపోతూ కెమెరాకు ఫోజులిచ్చింది.
ఆ తర్వాత ఇసుకు తిన్నెల్లో కూర్చొని ఫొటోలు దిగింది. సోనాక్షిసిన్హా ఐలాండ్ లో దిగిన ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. గతేడాది సల్మాన్ తో కలిసి దబాంగ్ 3లో మెరిసిన ఈ సుందరి, భుజ్..ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.