దిశా ప‌టానీ ఎన‌ర్జీకి స్ట‌న్ అవ్వాల్సిందే..వీడియో వైర‌ల్

Sep 24, 2020 , 17:34:02

దిశాపటాని..ఫిట్ నెస్ నియయాలు పాటించే వారి జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటుంది. తన టైం టేబుల్ లో జిమ్ సెషన్ కు ఎక్కువ గా సమయం కేటాయిస్తుందీ తార. తాజాగా ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో వర్కవుట్స్ వీడియో ఒకటి పోస్ట్ చేసింది. దిశా చూడటానికి సైజ్ లుక్‌లోనే క‌నిపించినా..160 కేజీల స్క్వాట్స్ తో 10 రెప్స్ చేసి అంద‌రూ స్ట‌న్ అయ్యేలా చేసింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ ఏడాది మోహత్‌సూరి డైరెక్ష‌న్ లో వ‌చ్చిన మ‌లంగ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించింది దిశాప‌టానీ.

తాజాగా ఈ భామ స‌ల్మాన్ ఖాన్ తో క‌లిసి రాధే..యువ‌ర్ మోస్ట్ వాంటెడ్ భాయ్. చిత్రంలో న‌టిస్తోంది. అదేవిధంగా మ‌రోసారి మ‌లంగ్ త‌ర్వాత మ‌రోసారి ఆదిత్యారాయ్ క‌పూర్ తో క‌లిసి ఏక్ విల‌న్ 2లో న‌టిస్తోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD