గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 15:25:19

అంధాధున్ రీమేక్ లో ఐశ్వ‌ర్యరాయ్‌..!

అంధాధున్ రీమేక్ లో ఐశ్వ‌ర్యరాయ్‌..!

హిందీలో బాలీవుడ్ న‌టుడు ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టించిన అంధాధున్ బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే. టబు, రాధికా ఆప్టే హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సూప‌ర్ హిట్ మూవీని ఇపుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నితిన్ హీరోగా న‌టిస్తుండ‌గా త‌మ‌న్నా, న‌భా న‌టేశ్ ఫీమేల్ లీడ్స్ లో క‌నిపించ‌నున్నారు. అయితే తాజాగా ఈ ప్రాజెక్టును త‌మిళంలో కూడా రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కోలీవుడ్ న‌టుడు ప్ర‌శాంత్ హీరోగా న‌టించ‌నున్నాడు. ప్ర‌స్తుతం న‌టీన‌టుల ఎంపిక కొన‌సాగుతున్నది.

ఈ చిత్రంలో ట‌బు పాత్ర‌ను మేక‌ర్స్ ఐశ్వ‌ర్యారాయ్  తో చేయించాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. ఈ మేర‌కు ఐష్ తో నిర్మాత‌లు సంప్ర‌దింపులు కూడా జ‌రుపుతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ప్ర‌శాంత్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ కార‌ణంగా ఐష్ ఈ చిత్రంలో న‌టించేందుకు సుముఖంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆస‌క్తిక‌ర విష‌మేంటంటే త‌మిళ్ వెర్ష‌న్ లో రాధికా ఆప్టే పోషించిన పాత్ర‌కు త‌మ‌న్నాను తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. ఓ వైపు తెలుగులో ట‌బు రోల్ చేస్తున్న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, మ‌రోవైపు త‌మిళ రీమేక్ లో మాత్రం రాధికా ఆప్టే పాత్ర‌లో సంద‌డి చేయ‌నుంది. మరి మేక‌ర్స్ త‌మ‌న్నాను ఫైన‌ల్ చేస్తారో లేదో చూడాలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.