శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 09:18:44

స‌రోజ్ ఖాన్ మృతికి బాలీవుడ్ ఘ‌న నివాళి

స‌రోజ్ ఖాన్ మృతికి బాలీవుడ్ ఘ‌న నివాళి

లెజండ‌రీ బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్ ఖాన్(71) ఈ రోజు తెల్ల‌వారుజామున గుండెపోటుతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో కొద్ది రోజుల క్రితం ఆసుప‌త్రిలో చేరిన స‌రోజ్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. డోలా రే డోలా, ఏక్ దో తీన్‌, ధ‌క్ ధ‌క్ ఇలా ఎన్నో సూప‌ర్ హిట్ సాంగ్స్‌కి ఆమె కొరియోగ్ర‌ఫీ చేశారు. స‌రోజ్‌కి భ‌ర్త సోహ‌న్‌లాల్‌, కొడుకు హ‌మీద్ ఖాన్, కూతురు హీనా ఖాన్‌, సుఖైన ఖాన్ ఉన్నారు.

స‌రోజ్ ఖాన్ మృతికి బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఘ‌న నివాళులు అర్పిస్తున్నారు.నిమ్ర‌త్ కౌర్, కునాల్ కోహ్లీ, రితేష్ దేశ్ ముఖ్, మ‌నోజ్ బాజ్‌పాయ్, సునీల్ గ్రోవ‌ర్, అక్ష‌య్ కుమార్ త‌దిత‌రులు స‌రోజ్ ఖాన్‌తో జ్ఞాప‌కాలు పంచుకున్నారు. అక్ష‌య్ కుమార్ త‌న ట్వీట్‌లో లేవగానే విచార‌క‌ర‌మైన వార్త విన్నాను. స‌రోజ్ ఖాన్ లేర‌నే వార్త విషాదాన్ని క‌లిగించింది. ఎంతో సులువుగా డ్యాన్స్ చేయ‌గ‌ల ఆమెతో ఎవ‌రైన డ్యాన్స్ చేయ‌గ‌ల‌రు. ఇండ‌స్ట్రీకి పెద్ద న‌ష్టం. ఆమె ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నాను అని అక్ష‌య్ అన్నారు 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo