మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 31, 2020 , 16:15:14

సోన‌మ్ పిక్నిక్ కు ఎక్క‌డికెళ్లిందో తెలుసా..?

సోన‌మ్ పిక్నిక్ కు ఎక్క‌డికెళ్లిందో తెలుసా..?

బాలీవుడ్ న‌టి సోన‌మ్ క‌పూర్ పెళ్ల‌యిన త‌ర్వాత త‌న భ‌ర్త ఆనంద్ అహూజాతో క‌లిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. క‌రోనా ప్ర‌భావంతో సినిమాలేవి లేక‌పోవ‌డం, కావాల్సినంత టైం దొర‌క‌డంతో ఆనంద్‌తో క‌లిసి సోన‌మ్  స‌ర‌దాగా షికార్లు చేస్తోంది. ఈ బ్యూటీ ఆనంద్ ఆహూజా బ‌ర్త్ డే స్పెష‌ల్ గా అత‌న్ని పిక్నిక్ కు తీసుకెళ్లింది. ఇంత‌కీ సోన‌మ్‌-ఆనంద్ ను ఎక్క‌డికి తీసుకెళ్లింద‌నుకుంటున్నారా..? ల‌ండ‌న్ లోని నోటింగ్ హిల్ లో పిక్నిక్ కు వెళ్లారు ఈ క్రేజీ క‌పుల్‌. గ్రీన్ గార్డెన్ లో పూలతో డెకరేష‌న్ చేసిన సెట‌ప్ ను సోన‌మ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

నా బ‌ర్త్ డే కానుక‌. సోన‌మ్ క‌పూర్..సింపుల్ ఔట్ డోర్ పిక్నిక్..అంటూ ఆనంద్ ఆహూజా త‌న పార్ట్ న‌ర్ సోన‌మ్ తో క‌లిసి దిగిన ఫొటోను షేర్ చేసుకున్నాడు. ఈ ఫొటోలు ఇపుడు నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo