మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 12, 2020 , 16:45:01

రియా కాల్‌ లిస్టులో ఫ్రెండ్స్ ఎవరెవరున్నారు..?

రియా కాల్‌ లిస్టులో ఫ్రెండ్స్ ఎవరెవరున్నారు..?

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆకస్మిక మృతి కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియాచక్రవర్తి ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియా కాల్‌ డేటా రికార్డుకు సంబంధించి కొన్ని పేర్లు ఇపుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు రియాకు చాలా మంది స్నేహితులే ఉన్నారట. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ రియాకు మంచి ఫ్రెండ్‌. రకుల్‌కు రియా 30 సార్లు ఫోన్‌ చేయగా..రకుల్‌ తిరిగి రియాకు 14 సార్లు కాల్‌ చేసింది. ఈ ఇద్దరు హీరోయిన్లు రెండు మెసేజ్‌లను కూడా పంపుకున్నారట. రానాతో మంచి స్నేహం ఉండటంతో రానాకు రియా 7 సార్లు ఫోన్‌ చేస్తే..రానా ఆమెకు 4 సార్లు కాల్‌ చేశాడట. అంతేకాదు అమీర్‌ఖాన్‌కు ఒకసారి కాల్‌ చేస్త..రియాకు అమీర్‌ఖాన్‌ 3 మెసేజ్‌లు పంపాడట.

ఆదిత్యారాయ్‌ కపూర్‌కు రియా 16 సార్లు ఫోన్‌ చేస్తే..రియాకు ఆదిత్యా 7 సార్లు కాల్‌ చేశాడట. అంతేకాదు రియా లెజెండరీ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌కు మూడు సార్లు ఫోన్‌ చేస్తే..సరోజ్‌ఖాన్‌ రియాకు తిరిగి 2 సార్లు కాల్‌ చేసిందట. డైరెక్టర్‌ మహేశ్‌భట్‌కు రియా 9 సార్లు కాల్‌ చేయగా..మహేశ్‌ భట్‌ రియాకు 7 సార్లు ఫోన్‌ చేసింది. శ్రద్దాకపూర్‌ రియాకు 2 సార్లు  ఫోన్‌ చేస్తే..రియా శ్రద్దాకపూర్‌ కు 3 సార్లు కాల్‌ చేసిందని సీడీఆర్‌లో స్పష్టమైనట్టు బీటౌన్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo