బుధవారం 23 సెప్టెంబర్ 2020
Cinema - Aug 13, 2020 , 16:14:20

ప్ర‌భాస్ డేట్స్ ను షారుక్ కు ఇచ్చిన దీపికాప‌దుకొనే..!

ప్ర‌భాస్ డేట్స్ ను షారుక్ కు ఇచ్చిన దీపికాప‌దుకొనే..!

ప్ర‌భాస్ 21వ చిత్రంలో బాలీవుడ్ న‌టి దీపికాప‌దుకొనే హీరోయిన్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాకు దీపికాప‌దుకొనే గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా రూ.25 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంద‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఈ బ్యూటీ చ‌పాక్ చిత్రం ఏడాది కాలంగా షూటింగ్ దూరంగా ఉంది. అయితే ఈ కాలంలో దీపికా ప‌దుకొనే మొద‌ట త‌న డేట్స్ ను షారుక్‌ఖాన్ తో న‌టించ‌నున్న ప‌ఠాన్ సినిమా‌కు కేటాయించింది. మ‌రో వైపు ప్ర‌భాస్ సినిమాకు సంత‌కం కూడా చేసింది. కానీ దీపికా వెంట‌నే షారుక్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ద‌మ‌వుతుంద‌ట‌.

న‌వంబ‌ర్ లో షారుక్ ఖాన్ సినిమా షూటింగ్ ను షురూ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌భాస్-21 వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ నేప‌థ్యంలో మొద‌ట షారుక్ సినిమా చేసి..ఆ త‌ర్వాత ప్ర‌భాస్ సినిమాకు ప‌నిచేయ‌నుంద‌ట దీపికాప‌దుకొనే. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo