బుధవారం 02 డిసెంబర్ 2020
Cinema - Aug 22, 2020 , 20:38:59

గ‌ణ‌ప‌తికి వెల్ క‌మ్ చెప్పిన అన‌న్య‌పాండే

గ‌ణ‌ప‌తికి వెల్ క‌మ్ చెప్పిన అన‌న్య‌పాండే

దేశ‌వ్యాప్తంగా వినాయ‌క చ‌వితి సంబురాలు కొన‌సాగుతున్నాయి. సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన సెల‌బ్రిటీలు క‌రోనా ఎఫెక్ట్ తో ఇంటి వ‌ద్దే గణేశుడి విగ్ర‌హాలను పెట్టుకుని..పూజ‌లు చేస్తున్నారు. బాలీవుడ్ న‌టి అన‌న్య పాండే త‌న ఇంటిలోకి బొజ్జ గ‌ణ‌ప‌య్య‌కు స్వాగ‌తం ప‌లికింది. 

నా కిష్ట‌మైంది ఇక్క‌డ ఉంది. ముంబైలోని త‌న ఇంట్లో బొజ్జ గ‌ణ‌ప‌య్య‌కు పూజ‌లు చేసింది. గ‌ణేశ్ చ‌తుర్థి రోజుల వినాయ‌కుడిని ఇంటికి తీసుకురావ‌డం ప‌ట్ల చాలా ఆనందంగా ఉంది. ఎర్ర తివాచి ప‌రిచి పూల‌తో డెకరేట్ చేసిన మండ‌పంలో గ‌ణ‌ప‌తిని ప్ర‌తిష్టించి పూజ‌లు చేసింది అన‌న్య‌పాండే. ఈ బ్యూటీ గ‌ణేశ్ చ‌తుర్థిలో పాల్గొన్న ఫొటోలు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.