మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 04, 2020 , 18:43:52

మ‌హేశ్ బాబు సినిమాలో అనన్య‌పాండే..!

మ‌హేశ్ బాబు సినిమాలో అనన్య‌పాండే..!

పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం ఫైట‌ర్. విజ‌య్ దేవ‌ర కొండ‌కు జోడీగా బాలీవుడ్ న‌టి అన‌న్య పాండే న‌టిస్తోంది. ఈ సినిమా సెట్స్ పైకి ఉండగానే అన‌న్య పాండే గోల్డెన్ ఆఫ‌ర్ కొట్టేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. ప‌రశురామ్‌-మ‌హేశ్ బాబు కాంబినేష‌న్ లో వ‌స్తోన్న చిత్రం స‌ర్కారు వారి పాట. ఈ మూవీలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అయితే సెకండ్ హీరోయిన్ గా అనన్య పాండే పేరును  ప‌ర‌శురాం అండ్ టీం ప‌రిశీలిస్తుంద‌ట.

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. మే 31న సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స‌ర్కారు వారి పాట చిత్రాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo