సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Aug 16, 2020 , 22:19:41

నాని చిత్రంలో అదితీరావు హైద‌రి..!

నాని చిత్రంలో అదితీరావు హైద‌రి..!

టాలీవుడ్ స్టార్ హీరో నాని శ్యాం సింగరాయ్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తి అప్ డేట్ ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. బాలీవుడ్ న‌టి అదితీరావు హైద‌రి తీసుకోబోతున్న‌ట్టు తాజాగా టాలీవుడ్ లో చ‌ర్చ న‌డుస్తోంది. అంతేకాదు ఈ చిత్రంలో అదితీరావు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. టాక్సీవాలా డైరెక్ట‌ర్ రాహుల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌విని ఇప్ప‌టికే హీరోయిన్ గా ఎంపిక చేశారు.

క‌థానుగుణంగా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండ‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత‌వ‌ర‌కు నిజ‌ముందో వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ వ‌స్తే ర‌ష్మిక మంద‌న్నా తిర‌స్క‌రించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo