గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Aug 17, 2020 , 18:50:57

లెహెంగాలో కైరా, మ‌లైకా..ఫొటోలు వైర‌ల్

లెహెంగాలో కైరా, మ‌లైకా..ఫొటోలు వైర‌ల్

కైరా అద్వానీ..మ‌లైకా అరోరా..ఈ ఇద్ద‌రు బాలీవుడ్ అందాల భామ‌లు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కైరా అద్వానీ తెలుగు, హిందీ చిత్రాలు చేసుకుంటూ బిజీగా ఉండ‌గా..సీనియ‌ర్ న‌టి అయిన ‌లైకా అరోరా డ్యాన్స్ రియాలిటీ షోస్ తోపాటు స్పెష‌ల్ సాంగ్స్ తో అల‌రిస్తూ కెరీర్ ను కొన‌సాగిస్తోంది. నాలుగు ప‌దుల వ‌య‌స్సులో యువ హీరోయిన్ల‌కు తానేమి త‌క్కువ కానంటోంది. కైరా అద్వానీ ఆర్మాన్ జైన్ వెడ్డింగ్ ఈవెంట్ లో థిక్ రెడ్ లెహెంగాలో దేశీ అవ‌తార్ లుక్ తో అంద‌రి చూపు త‌న వైపు తిప్పుకుంటోంది.  

ఇండిపెండెన్స్ సెల‌బ్రేషన్స్ లో భాగంగా ప‌వ‌ర్ బ్లూ టింట్ సిల్వ‌ర్ క‌ల‌ర్ లెహెంగా మెరిసింది. త‌న‌దైన మేక‌ప్ స్టైల్ లో గార్జియ‌స్ లుక్ లో క‌నిపిస్తూ అంద‌రినీ మెస్మ‌రైజ్ చేస్తోంది. వేర్వేరు రంగుల్లో దాదాపు ఒకే ర‌క‌మైన లెహెంగా కైరా అద్వానీ, మ‌లైకా అరోరా ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.