మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Sep 16, 2020 , 14:19:23

సుశాంత్ రేవ్ పార్టీల‌కు శ్ర‌ద్దాక‌పూర్ కూడా వెళ్లేద‌ట‌..!

సుశాంత్ రేవ్ పార్టీల‌కు శ్ర‌ద్దాక‌పూర్ కూడా వెళ్లేద‌ట‌..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక మృతి త‌ర్వాత డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు రియాచ‌క్ర‌వ‌ర్తితోపాటు ఆమె సోద‌రుడిని అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. డ్ర‌గ్స్ స్కాండ‌ల్ తో సంబంధ‌మున్న మ‌రికొంత‌మందిని కూడా విచారించే ప‌నిలో ఉన్నారు అధికారులు. సుశాంత్ రేవ్ పార్టీల్లో డ్ర‌గ్స్ ఉండేవ‌ని రియా ఇప్ప‌టికే చెప్పింది. అయితే ఈ రేవ్ పార్టీల‌కు శ్ర‌ద్దాక‌పూర్ కూడా హాజ‌రైన‌ట్టు తాజాగా రియా చెప్పింద‌ట‌. 

సుశాంత్ కు చెందిన లోనావాలా ఫాంహౌజ్ పార్టీల‌కు చిచోరే కోస్టార్ శ్ర‌ద్దాక‌పూర్ త‌ర‌చూ వెళ్లేద‌ని చెప్పిన‌ట్టు టాక్‌. లోనావాలాలోని సుశాంత్ ఫాంహౌజ్ ను సారా అలీఖాన్, రియా చ‌క్ర‌వ‌ర్తితోపాటు శ్ర‌ద్దాక‌పూర్ త‌ర‌చూ వినియోగించుకునేవారని..రేవ్ పార్టీల‌కు హాజ‌ర‌య్యేవార‌ని, గంజాయి, స్మోకింగ్ పేప‌ర్స్‌, ఖ‌రీదైన వొడ్కా వాడ‌కం వారి పార్టీల్లో సాధార‌ణమ‌ని ఫాంహౌజ్ మేనేజ‌ర్ ర‌యీస్ వెల్ల‌డించిన‌ట్టు తెలుస్తోంది. ర‌యీస్ సెప్టెంబ‌ర్ 2018 నుంచి సుశాంత్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాడు. సుశాంత్ త‌న ఫాంహౌజ్‌కుల లాక్ డౌన్ కు ముందు వారానికి ఒక‌టి, రెండుసార్లు వ‌చ్చి వెళ్లేవాడ‌ని, అంతేకాదు లాక్ డౌన్ స‌మ‌యంలో ఫాంహౌజ్ లో ఉండేలా ప్లాన్ కూడా చేసుకున్నాడు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల వాటిని ర‌ద్దు చేసుకున్నాడ‌ని ర‌యీస్ చెప్పాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo