బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 15:00:49

సారాకు ఫిట్‌నెస్ పార్ట్‌న‌ర్ దొరికాడు..వీడియో

సారాకు ఫిట్‌నెస్ పార్ట్‌న‌ర్ దొరికాడు..వీడియో

బాలీవుడ్ అందాల భామ సారా అలీఖాన్  ఫిట్ నెస్ మంత్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. టైం దొరికితే చాలు జిమ్ లో వ‌ర్క‌వుట్స్ చేస్తూ..స్విమ్మింగ్ పూల్ లో స‌ర‌దాగా ఈత కొడుతూ చెమ‌టోడుస్తుంది. తాజాగా ఈ బ్యూటీ త‌గిన ఫిట్ నెస్ పార్ట్ న‌ర్ దొరికాడు. ఎప్పుడూ సోలోగా జిమ్ లో వ‌ర్క‌వుట్స్ చేసే సారా ఇపుడు త‌న కోస్టార్ ధ‌నుష్ తో క‌లిసి జిమ్ సెష‌న్ లో పాల్గొంది. బ్లూ టీ ష‌ర్ట్‌, తెలుపు రంగు ట్రౌజ‌ర్ లో ఉన్న ధ‌నుష్‌, క్యాజువ‌ల్ జిమ్ అవుట్ ఫిట్ లో సారా ట్రైన‌ర్ సూచ‌న‌ల మేర‌కు ఎక్స‌ర్‌సైజ్ చేస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. త‌లైవాతో ట్రైనింగ్ సెష‌న్ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ష‌న్ లో అక్ష‌య్ కుమార్‌-సారా అలీఖాన్-ధ‌నుష్ కాంబోలో వ‌స్తోన్న చిత్రం అట్రాంగి రే. రొమాంటిక్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకురానుంది.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo