శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 25, 2020 , 19:37:39

మెహిందీ సెర్మ‌నీలో మెరిసిన స‌నాఖాన్‌

మెహిందీ సెర్మ‌నీలో మెరిసిన స‌నాఖాన్‌

టాలీవుడ్ యాక్ట‌ర్ నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా వ‌చ్చిన క‌త్తి చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది ముంబై భామ స‌నాఖాన్‌. ఈ బ్యూటీ గుజరాత్ కు చెందిన అన‌స్ స‌యీద్ ను గ‌త‌వారం నిఖా చేసుకుంది. తెలిసిందే. ఇప్ప‌టికే వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫాలోవ‌ర్ల‌తో షేర్ చేసుకుంది. ఈ భామ మెహిందీ సెర్మ‌నీలో పాల్గొన్న‌పుడు తీసిన ఫొటోలు తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది ఈ స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

పూన‌మ్ కౌర్ ట్యూర్ డిజైన్ చేసిన ఆరెంజ్అవుట్‌ఫిట్ లో హౌజ్ ఆఫ్ సిఖా జ్యువెలరీతో ద‌గ‌ద‌గ మెరిసిపోయింది. నా జీవితంలో భాగమై..అంద‌మైన ప్ర‌యాణాన్ని షురూ చేసినందుకు ధ‌న్య‌వాదాలు. నీ ప్రేమ‌, మ‌ద్ద‌తుకు కృత‌జ్ఞ‌త‌లు అంటూ నిఖాకు సంబంధించిన స్టిల్ షేర్ చేస్తూ పోస్ట్ పెట్టాడు అన‌స్ స‌యీద్‌. న‌వంబ‌ర్ 20న ఈ ఇద్ద‌రు వివాహబంధంతో ఒక్క‌టైన విష‌యం తెలిసిందే. 
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.