శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 08:54:02

జీతం క‌ట్ చేసినందుకు సంతోషంగా ఉన్న ‌స‌ల్మాన్..!

జీతం క‌ట్ చేసినందుకు సంతోషంగా ఉన్న ‌స‌ల్మాన్..!

బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ స‌ల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ 14 సీజ‌న్ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతు్న సంగ‌తి తెలిసిందే. క‌ల‌ర్స్ టీవీలో అక్టోబ‌ర్ 3 నుంచి షో షురూ కానుంది. ఈ షోకు స‌ల్మాన్ ఖాన్ భారీ మొత్తంలో రూ.250 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకోనున్నాడ‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. ఎపిసోడ్ కు రూ.10.25 కోట్లు చొప్పున 12 వారాలకు ఈ మొత్తం తీసుకుంటున్న‌ట్టు బీటౌన్ టాక్‌. అయితే కోవిడ్‌-19 ప్ర‌భావంతో స‌ల్మాన్ ఖాన్ రెమ్యున‌రేష‌న్ లో బిగ్ బాస్ నిర్వాహ‌కులు కోత పెట్టింద‌ట‌. త‌న జీతాన్ని క‌ట్ చేసి బిగ్ బాస్ షో సిబ్బందికి చెల్లించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని స‌ల్మాన్ చెప్ప‌డమే ఇందుకు నిద‌ర్శ‌నం.

ఈ సీజ‌న్ ను నేను చేయ‌డానికి కార‌ణం..ఈ సారి బిగ్ బాస్ 14 ద్వారా చాలా మందికి ఉపాధి ఉద్యోగ‌వ‌కాశాలు దొరుకుతాయని మీడియాతో జ‌రిపిన ముఖాముఖిలో చెప్పాడు స‌ల్మాన్‌. షో కోసం ప‌నిచేసే సిబ్బంది కోవిడ్ ప్ర‌భావంతో షిప్ట్ ల వారిగా ప‌నిచేస్తున్నారు. కానీ వారికి ఎలాంటి క‌టింగ్స్ లేకుండా మొత్తం జీతాన్ని అంద‌జేస్తున్న‌ట్టు చెప్పాడు స‌ల్మాన్‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo