ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 02, 2020 , 20:17:14

అర్థరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన రియా ఫ్యామిలీ..!

అర్థరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన రియా ఫ్యామిలీ..!

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ మృతి కేసులో తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు మేర‌కు బీహార్ పోలీసులు రియా చ‌క్ర‌వ‌ర్తి స‌హా మ‌రో ఐదుగురు కుటుంబ‌స‌భ్యుల‌పై కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. బీహార్ పోలీసులు ఇప్ప‌టికే ముంబై వెళ్ల‌గా రియా ఇంటి ద‌గ్గ‌ర లేన‌ట్టు గుర్తించారు. అయితే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో రియా త‌న త‌ల్లిదండ్రులు సోదురుడితో క‌లిసి ఇంటి నుంచి వెళ్లిపోయిన‌ట్టు జాతీయ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. బ్లూ కారులో రియా కుటుంబ‌స‌భ్యులు అర్థ‌రాత్రి ఇంటి ద‌గ్గ‌ర నుంచి వెళ్లిపోయారు. వారి వెంట పెద్ద సూట్ కేసు కూడా ఉందని సూప‌ర్ వైజ‌ర్ ఒక‌రు చెప్పినట్టు వార్త క‌థ‌నం. అంతేకాదు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొంత‌కాలంగా ఆమె ఇంటికి రావ‌డం మానేశాడ‌ని కూడా చెప్పాడ‌ట‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో రియా ఫ్యామిలీ ఇలా వెళ్ల‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 

మ‌రోవైపు సుశాంత్ ‌ మృతి కేసులో రియా చక్రవర్తి వేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఆ పిటిష‌న్‌పై ఆగ‌స్టు 5న విచార‌ణ జ‌రుగ‌నుంది. జ‌స్టిస్ హృషికేశ్‌రాయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం రియా పిటిష‌న్‌పై వాద‌న‌లు విన‌నుంది. అయితే ఈ కేసులో ఏదైనా నిర్ణ‌యాన్ని వెల్ల‌డించే ముందు త‌మ వాద‌న‌లు కూడా వినాలంటూ బీహార్‌, మ‌హారాష్ట్ర పోలీసుల‌తోపాటు సుశాంత్ రాజ్‌పుత్ తండ్రి కూడా సుప్రీంకోర్టులో కేవియ‌ట్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo