సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Oct 16, 2020 , 19:11:50

'ది వైట్ టైగ‌ర్' ఫొటోలు షేర్ చేసిన‌ ప్రియాంకాచోప్రా

 'ది వైట్ టైగ‌ర్' ఫొటోలు షేర్ చేసిన‌ ప్రియాంకాచోప్రా

బాలీవు్డ్ న‌టి ప్రియాంకా చోప్రా కీ రోల్ లో న‌టిస్తోన్న నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్టు 'ది వైట్ టైగ‌ర్'‌. భార‌త ర‌చ‌యిత అర‌వింద్ అడిగా రాసిన 'ది వైట్ టైగ‌ర్' న‌వ‌ల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు హాలీవుడ్ డైరెక్ట‌ర్ ర‌మిన్ బ‌హ్రాని. తాజాగా ఈ సిరీస్ షూటింగ్ లొకేష‌న్ నుంచి కొన్ని ఫొటోల‌ను ప్రియాంక చోప్రా ట్విట‌ర్ ద్వారా షేర్ చేసింది. ది వైట్ టైగ‌ర్ ఫ‌స్ట్ లుక్ ను అందిస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది. ది వైట్ టైగ‌ర్ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్ల‌ర్ గా నిలిచి, 2008లో బ్యాన్ బుక‌ర్ ప్రైజ్ గెలుచుకుందని ట్వీట్ లో పేర్కొంది.

ది వైట్ టైగ‌ర్ లో రాజ్ కుమార్ రావు, ఆద‌ర్శ్ గౌర‌వ్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ల‌క్ష్మ‌ణ్ గ‌ఢ్ (రాజ‌స్థాన్‌)గ్రా‌మానికి చెందిన బ‌ల్ రామ్ హ‌ల్వాయ్ అనే వ్య‌క్తి చుట్టూ తిరిగే క‌థాంశంతో ది వైట్ టైగ‌ర్ న‌వ‌ల కొన‌సాగుతుంది.  విన‌య‌పూర్వ‌క‌మైన నేప‌థ్యం నుంచి ఉన్న‌త‌స్థాయి వ్య‌వ‌స్థాప‌కుడిగా ఎలా ఎదిగార‌నే క‌థాంశం చుట్టూ తిరుగుతుంది. అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత ప్రియాంక భార‌తీయ సినిమాల‌కు దూర‌మైన విష‌యం తెలిసిందే. logo