శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 17:10:16

2020కి థ్యాంక్స్ చెప్పిన‌ మలైకా..వీడియో

2020కి థ్యాంక్స్ చెప్పిన‌ మలైకా..వీడియో

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా కోవిడ్ బారిన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే డాక్ల‌ర్ల స‌ల‌హాలు, సూచ‌నలు పాటిస్తూ మ‌నోధైర్యంతో క‌రోనా నుంచి కోలుకుంది. ఈ ఒక్క విష‌యం మిన‌హా మ‌లైకా ఆల్బ‌మ్ లో అన్నీ సంతోష‌క‌ర‌మైన క్ష‌ణాల‌తో నిండిపోయింది. ఈ డ్యాన్సింగ్ క్వీన్ 2020ను ప్ర‌శంసిస్తూ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. మ‌లైకా కుమారుడు అర్హాన్‌, బాయ్‌ఫ్రెండ్ అర్జున్ క‌పూర్, కుటుంబ‌స‌భ్యుల‌తో గ‌డిపిన అరుదైన క్ష‌ణాల‌తో నిండిన వీడియో ఆల్బ‌మ్ ను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. నేను కావాల‌నుకున్న ప్ర‌తీది పొందిన సంవ‌త్స‌రం 2020. ఈ ఏడాది జ‌రిగిన ప్ర‌తీ విష‌యం ప్ర‌శంసించ‌ద‌గిన‌ద‌ని నాకు తెలుసు..అనే పోస్ట్‌తో షురూ అయిన వీడియోను పోస్ట్ చేసింది

అర్జున్‌క‌పూర్, పిల్ల‌ల‌తో, ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో సిస్ట‌ర్స్ తో ఎంజాయ్ చేసిన ఆనంద‌క‌ర‌క్ష‌ణాల‌ను వీడియోలో చూడొచ్చు. మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు అంటూ సుదీర్ఘ‌మైన సందేశాన్ని పోస్ట్ ద్వారా త‌న ఫాలోవ‌ర్ల‌తో షేర్ చేసుకుంది. మ‌లైకా షేర్ చేసిన ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.