మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 21, 2020 , 17:27:07

డాక్ట‌ర్ డ్యాన్స్ పై మాధురీ దీక్షిత్ ప్ర‌శంస‌లు

డాక్ట‌ర్ డ్యాన్స్ పై మాధురీ దీక్షిత్ ప్ర‌శంస‌లు

అసోంలో ఓ డాక్టర్‌ పీపీఈ కిట్‌, ఫేస్‌షీల్డ్‌ మాస్కు పెట్టుకుని డ్యాన్స్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన విష‌యం తెలిసిందే. హృతిక్ రోష‌న్ హీరోగా న‌టించిన వార్‌ చిత్రంలోని ‘గున్గురూ..’ పాటకు డాక్ట‌ర్ అరూప్ సేనాప‌తి అదిరిపోయే స్టెప్పులేసి ఔరా అనిపించాడు. ఈ వీడియోను డాక్టర్ సయ్యద్ ఫైజాన్ అహ్మద్ అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను చూసిన హృతిక్ రోష‌న్ ఫిదా అయిపోయాడు. ఇపుడు మ‌రో బాలీవుడ్ న‌టి మాధురీ దీక్షిత్‌ డాక్ట‌ర్ అరూప్ స్టెప్పుల‌కు స్ట‌న్ అయిపోయింది.

డాక్ట‌ర్ అరూప్ కున్న స్పిరిట్ పై ప్ర‌శంస‌లు కురిపించింది. అద్బుత‌మైన స్పిరిట్ తో డ్యాన్స్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టాడు. ఇదే స్పిరిట్ తో పాజిటివ్ గా ఉండాల‌ని మాధురీ దీక్షిత్‌ సూచించింది. నేను ఏదో ఒక రోజు అసోంలో  డాక్ట‌ర్ అరూప్ తో డ్యాన్స్ స్టెప్పుల‌ను నేర్చుకుంటాను..అంటూ హృతిక్ రోష‌న్  వీడియోను ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.