శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 18:11:39

సీత పాత్ర‌లో మ‌హేశ్ హీరోయిన్ ఫైన‌ల్‌..!

సీత పాత్ర‌లో మ‌హేశ్ హీరోయిన్ ఫైన‌ల్‌..!

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌-ఓం రావ‌త్ కాంబోలో తెర‌కెక్కుతున్న ప్రాజెక్టు ఆదిపురుష్. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్ గా న‌టిస్తున్నాడు. ప్ర‌భాస్ ఈ చిత్రంలో రాముడిగా క‌నిపించ‌నున్నాడు. అయితే ఈ సినిమాలో సీత పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే విష‌యంపై ఇప్ప‌టికే చాలా వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. అనుష్కా శెట్టి, అనుష్క‌శ‌ర్మ‌, కైరా అద్వానీ, కీర్తిసురేశ్ ఇలా టాప్ హీరోయిన్ల పేరు వినిపించాయి.  తాజాగా వ‌న్ నేనొక్క‌డినే ఫేం కృతిస‌న‌న్ పేరు ఖ‌రారైన‌ట్టు బీటౌన్ వ‌ర్గాల స‌మాచారం. అయితే దీనిపై ప్ర‌భాస్ టీం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. 

2021 జ‌న‌వ‌రిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. లాంగ్ షెడ్యూల్ లో షూటింగ్ కొన‌సాగించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. క్రోమా స్క్రీన్ కాకుండా ఎక్కువ‌భాగం స్టూడియోలోనే చిత్రీక‌రించ‌నున్న‌ట్టు ఆదిపురుష్ టీం ప్ర‌తినిధి ఒక‌రు చెప్పారు. స్టార్ వార్స్‌, అవ‌తార్ వంటి సినిమాల‌కు ప‌నిచేసి అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వీఎఫ్ఎక్స్ నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సినిమా షూటింగ్ ను పూర్తిచేసేందుకు ఓం రావ‌త్‌, భూష‌ణ్ ప్లాన్ చేస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.