శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 14:52:36

జిమ్‌లో చెమ‌టోడుస్తున్న కృతి..వీడియో

జిమ్‌లో చెమ‌టోడుస్తున్న కృతి..వీడియో

తెలుగులో దోచెయ్‌, వ‌న్ నేనొక్క‌డినే చిత్రాల్లో న‌టించి..ఆ త‌ర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది కృతిస‌నన్. ఈ భామ హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీర‌క‌లేకుండా ఉంది. కృతి స‌న‌న్ న‌టిస్తోన్న మిమి చిత్రం కోసం బాగానే బరువు పెరిగింది. ఇక ఆ త‌ర్వాత లాక్ డౌన్ తో ఇంటిపట్టునే ఉండ‌టంతో అప్ప‌డ‌పుడు జిమ్‌లో త‌న టైం గ‌డిపేది. తాజాగా ఈ భామ జిమ్‌లో చెమ‌టోడుస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

వివిధ ర‌కాల వ్యాయామాల‌ను చేస్తూ చెమ‌ట చిందిస్తోంది. స్లిమ్ గా ఫిట్ గా ఉండేందుకు కృతిస‌న‌న్ జిమ్ లో పుష్ అప్స్‌, వెయిట్ లిఫ్టింగ్ తోపాటు ప‌లు ఎక్స‌ర్ సైజ్ లు చేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ వీడియో ఫిట్ నెస్ ప్రేమికుల‌కు  ఇన్ స్పిరేష‌న్ గా నిలుస్తోంది. ప్ర‌స్తుతం రాజ్ కుమార్ రావుతో క‌లిసి ఓ సినిమా చేస్తోంది కృతి. ఈ మూవీ షూటింగ్ చండీగ‌ఢ్ లో జ‌రుగుతోంది.